FbTelugu

నాగపూర్ లో లాక్ డౌన్

ముంబయి: మహారాష్ట్ర ప్రభుత్వం కరోనా కేసుల ఉధృతి దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకున్నది. నాగపూర్ లో లాక్ డౌన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 15 నుంచి 21 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది.

కరోనా వ్యాప్తి దృష్ట్యా మరోసారి లాక్ డౌన్ విధించక తప్పడం లేదని వెల్లడించింది. మహారాష్ట్రలో బుధవారం ఒక్కరోజే 13వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం సంచలనం రేపింది. దేశ వ్యాప్తంగా బుధవారం నాడు నమోదు అయిన కేసులలో సగానికి పైగా మహారాష్ట్రలోనే రావడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పవచ్చు. మొన్నటి వరకు పదివేల వరకు నమోదు అయిన కేసులు అమాంతం పెరిగాయి. కరోనా కేసుల ఉధృతిని తగ్గించేందుకు నాగపూర్ లో లాక్ డౌన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ తరువాత మిగతా ప్రాంతాలపై దృష్టి సారించనున్నారు. ప్రస్తుతం నాగపూర్, ముంబయిలో అత్యధికంగా కేసులు వస్తున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.