రాయపూర్: కరోనా కేసులు పెరుగుతుండడంతో నియంత్రించేందుకు రాయపూర్ పట్టణంలో పది రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ఛత్తీస్ గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ 9వ తేదీ నుంచి 19వ తేదీ వరకు లాక్ డౌన్ అమలుల్లో ఉండనున్నది.
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండడంపై ఇవాళ సిఎం భూపేశ్ బఘేల్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఒక్క రాయపూర్ నగరంలోనే 13107 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు నివేదిక అందచేశారు. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 9921 కేసులు నమోదు కాగా 53 మంది మరణించారని తెలిపారు. ఆసుపత్రులలో పడకల లభ్యత, ఆక్సిజన్, ఐసియులో బెడ్లు, మందుల లభ్యతపై పూర్తిస్థాయిలో చర్చించారు. దుర్గ్, రాయపూర్, రాజ్ నంద్ గావ్, మహాసముండ్ లలో ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి. అనవసరంగా ప్రజల ఇళ్ల నుంచి బయటకు రావద్దని, ప్రయాణాలు తగ్గించుకోవాలని, పెళ్లిళ్లు, విందులకు దూరంగా ఉండాలని సిఎం భూపేష్ కోరారు.