FbTelugu

ఇక ప్రతి ఆదివారం లాక్ డౌన్

చెన్నై: రోజు రోజుకి కరోనా కేసులు తీవ్రంగా పెరిగిపోతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రాష్ట్రంలో ప్రతి ఆదివారం సంపూర్ణ లాక్ డౌన్ పాటించాలంటూ నిర్ణయం తీసుకుంది.

అత్యధిక కరోనా కేసులు నమోదౌతున్న రాష్ట్రాల్లో తమిళనాడు ముందువరుసలోనే ఉన్న తరుణంలో.. కరోనా వ్యాప్తిని తగ్గించడంలో భాగంగా తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆదివారం పూర్తిగా అన్నీ బంద్ ఉంటాయన్న కారణంలో శనివారమే ప్రజలు షాపుల ముందు గుంపులు గుంపులుగా చేరుతున్నారు. ముఖ్యంగా వైన్స్ షాపుల ముందు ఎక్కువగా గుమిగూడుతున్నారు.

You might also like