FbTelugu

వైరస్ విజృంభణతో మళ్లీ చైనాలో లాక్ డౌన్

బీజింగ్: కరోనా వైరస్ చైనా దేశాన్ని ఇప్పట్లో వీడేలా లేదు. తాజాగా బీజింగ్ కు దక్షిణంగా ఉన్న రెండు నగరాలలో వైరస్ విజృంభణ కొనసాగుతుండడంతో లాక్ డౌన్ విధించింది.

రెండు నగరాలకు రహదారులను మూసివేయడంతో పాటు పూర్తిగా రవాణా సౌకర్యాలను నిలిపివేసింది. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని ప్రభుత్వం హెచ్చరించింది. ఉత్తర చైనాలోని హెబీ ప్రావిన్స్ లో గత వారంలో 127 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. అదనంగా 183 అసింప్టమాటిక్ ఇన్ ఫెక్షన్లు కన్పించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. నియంత్రించేందుకు జింగ్టాయ్, షిజియాగంజ్ నగరాల్లో పూర్తి లాక్ డౌన్ విధించారు. ఈ ప్రాంతానికి చెందిన వారు బీజింగ్ లోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకుంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.