FbTelugu

మే 30 వరకు లాక్ డౌన్: కెసిఆర్

హైదరాబాద్: తెలంగాణలో లాక్ డౌన్ మరోసారి పొడిగిస్తున్నట్లు సిఎం కెసిఆర్ ప్రకటించారు. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ నెల 21 తో ముగియాల్సి ఉండగా మే 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.

మంత్రివర్గ సహచరుల అభిప్రాయాలను తీసుకున్న తరువాత సిఎం కెసిఆర్ లాక్ డౌన్ ను మే 30 వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన జిఒ ను విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. కరోనా నియంత్రణ కార్యక్రమాల్లో, వైద్య సేవల పర్యవేక్షణలో భాగంగా మంత్రులు బిజీగా ఉన్నందున ఈ నెల 20 న నిర్వహించాల్సిన మంత్రివర్గ సమావేశాన్ని సిఎం రద్దు చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.