FbTelugu

జూన్ 30 వరకు లాక్ డౌన్

జూన్ 8 నుంచి హోటళ్లకు అనుమతి

కంటైన్మెంట్ జోన్లలో పూర్తి లాక్ డౌన్

కర్ఫ్యూ రాత్రి 9 నుంచి ఉదయం 5 వరకు

మెట్రో రైలు, పబ్బులు, థియేటర్లు, సభలకు అనుమతి లేదు

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలు సడలించింది. ఈ మేరకు ఇవాళ లాక్ డౌన్ 5 మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే దేశ వ్యాప్తంగా జూన్ నెలాఖరు వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని ప్రకటించింది.

నాలుగవ విడత లాక్ డౌన్ మే 31వ తేదీతో ముగియనుంది. జూన్ 1 నుంచి అమలయ్యే లాక్ డౌన్ 5.0 లో కొన్ని వ్యాపారాలకు సడలింపులు ఇచ్చింది. జూన్ 8వ తేదీ నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ తెరుచుకునేందుకు అనుమతించింది. అదే విధంగా ప్రార్థనా మందిరాలు తెరుచుకుని ఎప్పటి మాదిరే ప్రార్థనలు చేసుకోవచ్చు. కర్ఫ్యూ రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉండనున్నది. పార్కులు, థియేటర్లు, సభలు, సమావేశాలు, జిమ్ లు, బార్లు, పబ్బులు, క్లబ్సులు, ఆడిటోరియం, స్విమ్మింగ్ ఫూల్స్, మెట్రో రైళ్ల పై నిషేధం కొనసాగుతుందని ప్రకటించింది.

విద్యా సంస్థల పునఃప్రారంభం పై జూలై నెలలో నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రాలను సంప్రదించిన తరువాత వీటిపై నిర్ణయం తీసుకోనున్నారు.  దేశ వ్యాప్తంగా కంటైన్మెంట్ జోన్లలో యాథవిధిగా లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తారు. రాజకీయ, సంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలను కూడా నిషేధించారు. అయితే రాష్ట్రాల ప్రజల రాకపోకలు, సరకుల రవాణాకు అనుమతించారు.

You might also like