FbTelugu

తిరుమలకు లాక్ డౌన్ కష్టాలు

తిరుమల: లాక్ డౌన్ కారణంగా సిబ్బంది వేతనాలు, రోజువారి వ్యయాలకు టీటీడీ ఖజానాలో తగిన నగదు లేకుండా పోయింది.

రోజువారీ హుండీ ఆదాయం, దర్శనాల ఆదాయం రాబడి పూర్తిగా ఆగిపోవడంతో కొంత మేర ఆర్థిక ఇబ్బందులను బోర్డు ఎదుర్కొంటున్నది. ఇప్పటికే లాక్ డౌన్ కాలంలో ఉద్యోగుల వేతనాలు, పింఛన్లు, ఇతర ఖర్చుల కోసం రూ. 300 కోట్లు ఖర్చు చేశారు. టీటీడీ వద్ద 8 టన్నుల బంగారం నిల్వలతో పాటు రూ. 14వేల కోట్లు ఫిక్సిడ్ డిపాజిట్లు ఉన్నాయి. వీటిని ముట్టకుండా ఈ గండం నుంచి గట్టెక్కాలని టీటీడీ భావిస్తోంది.

తిరుమల నెలసరి ఆదాయం దాదాపు రూ. 200-220 కోట్ల వరకు ఉంటుందని అంచనా. లాక్ డౌన్ కారణంగా గత 50 రోజులుగా భక్తులను అనుమతి పూర్తిగా నిలిపివేశారు. దీంతో రాబడి పూర్తిగా పడిపోయింది. తిరిగి ఎప్పుడు తెరుస్తారనే దానిపై స్పష్టత లేదు. టీటీడీ ఉద్యోగుల వేతనాలు, ఫించన్లు, ఇతర ఖర్చుల కోసం ప్రతి నెలా రూ.200 కోట్ల దాకా వెచ్చించాల్సి ఉంటుంది.

ఉద్యోగులకు జీతాలు, పెన్షన్ల చెల్లింపులపై టీటీడీ స్పందించింది. ఉద్యోగుల జీతాలు చెల్లింపులో ఎటువంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేసింది. లోక్‌డౌన్ కారణంగా వచ్చే ఆదాయం తగ్గిందని పేర్కొంది. అయినప్పటికీ గత రెండు నెలలుగా ఉద్యోగుల జీతాలు చెలిస్తున్నామని టీటీడీ స్పష్టం చేసింది.

You might also like