FbTelugu

ఆ ప్రాంతాల్లో లాక్ డౌన్ యథాతథం: కిషన్ రెడ్డి

హైదరాబాద్: కరోనా వైరస్ నేపథ్యంలో హాట్ స్పాట్స్, రెడ్ జోన్లలో లాక్ డౌన్ యథాతథంగా కొనసాగనున్నట్టు బీజేపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలను వెల్లడించారు. అవసరమైతే లాక్ డౌన్, ఆంక్షల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించనున్నట్టు తెలిపారు.

అయితే గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని సడలింపులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలిపారు. అదేవిధంగా కరోనా ప్రభావం లేని ప్రాంతాల్లో కూడా కొన్ని సడలింపులు ఇవ్వనున్నట్టు తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థలు పనిచేయవని తెలిపారు. దేశంలో మొత్తం 290 జిల్లాల్లో కరోనా ప్రభావం లేదని తెలిపారు. వీటికి సంబంధించి ప్రధాని మోదీ మే 02 న ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలిపారు. దీనిపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తో చర్చించాక మోదీ తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

You might also like