FbTelugu

జూన్ 7 నుంచి లాక్ డౌన్ సడలింపు?

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో లాక్ డౌన్ కొనసాగించాలా? వద్దా? అనేదానిపై ప్రభుత్వం యోచిస్తున్నది. రానున్న వారం పది రోజుల్లో కేసులు తగ్గితే సడలించేందుకు రోడ్డు మ్యాప్ తయారు చేయాల్సిందిగా సిఎం బిఎస్.యడ్యూరప్ప అధికారులను ఆదేశించారు.

నిపుణుల అంచనాల ప్రకారం జూన్ నెలాఖరు వరకు సెకండ్ వేవ్ ఉధృతి తగ్గుతుందనే సమాచారం ఉందని కరోనా క్లినికల్ నిపుణుల బృందం చైర్మన్ డాక్టర్ ఎస్.సచ్చితానంద్ తెలిపారు. ప్రస్తుత కేసులను పరిశీలిస్తే అంతకన్నా ముందుగానే పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయన్నారు. బెంగళూరు కార్పొరేషన్ చీఫ్ గౌరవ్ గుప్తా మాట్లాడుతూ, నగరంలో కేసుల రికవరీ శాతం పెరిగిందని, కొత్త కేసులు కూడా తగ్గాయన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉంటే మళ్లీ వ్యాపారాలు పుంజుకుటాయని ఆయన తెలిపారు. మే నెల 1 నుంచి 7వ తేదీ వరకు 1,51,722 కేసులు, మే 15 నుంచి 21వ తేదీ మధ్య 74,531 కేసులు వచ్చాయన్నారు. లాక్ డౌన్ కారణంగానే కేసులు తగ్గుముఖం పట్టాయని అంటున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా లాక్ డౌన్ ఆంక్షల సడలింపులపై సంప్రదింపులు జరుపుతున్నది. జూన్ మొదటి వారం తరువాత పలు రాష్ట్రాలలో ఆంక్షలు ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.