FbTelugu

తమిళనాడులో మరోసారి లాక్ డౌన్

చెన్నై: కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ విధించింది. ముఖ్యంగా తమిళనాడులోని 4 జిల్లాల్లో ఈ నెల 19 నుంచి 30 వరకు సంపూర్ణ లాక్ డౌన్ ను అమలు చేయనున్నట్టు తెలిపింది.

చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్ పట్టులో లాక్ డౌన్ విధించారు. ఉదయం 6:00 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు మాత్రమే నిత్యావసరాలకు అనుమతించనున్నట్టు తెలిపారు. హోటల్లు, రెస్టారెంట్లలో పార్శిళ్లకు మాత్రమే అనుమతించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.