FbTelugu

తెలంగాణలో కనిపించని లాక్‌డౌన్‌

తెలంగాణలో కరోనాను నియంత్రించేందుకు సీఎం కేసీఆర్‌ ఈ నెల 31వరకు లాక్‌డౌన్‌ ప్రకటించారు. ఆదివారం నిర్వహించిన జనతా కర్ఫ్యూకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఎక్కడా ఒక మనిషి కూడా ఇంటినుంచి బయటకు రాలేదు. అంతా స్వీయ నిర్బంధంలోనే ఉన్నారు. ఈ విషయాన్ని కేసీఆర్‌ కూడా ఆదివారం సాయంత్రం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో గొప్పగా చెప్పారు. కేంద్రం కూడా దేశంలో బాగా జనతా కర్ఫ్యూ జరిగింది తెలంగాణలోనే అని కేంద్ర హోంశాఖ మంత్రి కూడా ప్రశంసించినట్టు చెప్పారు. ఇంతవరకు బాగానే ఉంది.

వాస్తవానికి జనతా కర్ఫ్యూ ఆ స్థాయిలోనే జరిగింది. అయితే, సోమవారం నుంచి ఈ నెల 31వరకు కూడా ఇదేరీతిలో సాగాలని, దీనికి ప్రజలు అదేరకంగా స్పందించాలని లాక్‌డౌన్‌ విధించారు. ఈ లాక్‌డౌన్‌ ఉన్న రోజుల్లో అత్యవసర సేవలు మినహా వేరే ఏమీ పనిచేయవద్దని చెప్పారు. ఆటోలు సహా బస్సులు, రైళ్లు, మెట్రోలు కూడా పనిచేయవని చెప్పారు. కానీ, సోమవారం నాటి పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా సాగుతోంది. రోడ్లపై జనం కుప్పలు కుప్పలుగా తిరుగుతున్నారు. వాహనాల సంఖ్య భారీగానే ఉంది. వాహనాలతో రోడ్లన్నీ కిటకిటలాడుతున్నాయి.

దుకాణీలన్నీ తెరుచుకున్నాయి. కరోనా నివారణకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు జనం కూడా బాగా స్పందిస్తున్నారని కేసీఆర్‌ మెచ్చుకున్న కొద్ది గంటల్లోనే ఇలా జరగడం బా«ధాకరమే. ఇంత చెప్పినా జనం వాటిని పట్టించుకోవడం లేదంటే వారిని ఇంకా చైతన్యం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై మరింతగా ఉందని, అవసరమైతే కఠిన చర్యలు కూడా తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More