FbTelugu

ఫ్రాన్స్ లో లాక్ డౌన్: మెక్రాన్

పారిస్: కొన్ని దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ నడుస్తుండగా మరికొన్ని దేశాల్లో థర్డ్ వేవ్ కూడా మొదలైంది. ఫస్ట్ వేవ్ తో పోల్చితే సెకండ్, థర్డ్ వేవ్ లు తీవ్రంగా ఉన్నాయి. కరోనా మ్యుటెంట్లకు పలు దేశాలు వణికిపోతున్నాయి.

థర్డ్ వేవ్ తీవ్రంగా ఉన్నందున లాక్ డౌన్ విధించక తప్పడం లేదని ఫ్రాన్స్ దేశం అధ్యక్షుడు ఇమ్మన్యుయేల్ మెక్రాన్ ప్రకటించారు. కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పటి వరకు ఆ దేశంలో ఒక లక్ష మంది వరకు చనిపోయారు. కరోనా రోగులతో అక్కడి ఆసుపత్రుల్లో అత్యవసర విభాగాలు నిండిపోతున్నాయి. రోగులు పెరగడంతో ఆసుపత్రుల, వైద్య, ఆరోగ్య శాఖపై ఒత్తిడి పెరిగింది. పరిస్థితులు అదుపులోకి తెచ్చేందుకు, కరోనా వైరస్ ను నియంత్రించేందుకు లాక్ డౌన్ తప్ప మరో మార్గం లేదని ఆ దేశ అధ్యక్షుడు మెక్రాన్ చెబుతున్నారు. ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

థర్డ్ వేవ్ విజృంభణ దృష్ట్యా ఇప్పటికి కూడా చర్యలు తీసుకోనట్లయితే నియంత్రణ కోల్పోతామని అన్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించామని, దేశం మొత్తం అమలు చేస్తామని ఆయన తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.