FbTelugu

భట్టిప్రోలులో లాక్ డౌన్

గుంటూరు: భారీగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా అధికారులు జిల్లాలోని భట్టిప్రోలులో లాక్‌డౌన్‌ను విధించారు. నిన్న ఒక్క రోజే భట్టిప్రోలులో 70 కరోనా కేసులు నమోదయ్యయి.

మరింతగా విస్తరించకుండా ఉండేందుకు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఉదయం 7.00నుంచి 11.00 గంటల వరకే నిత్యవసర వస్తువుల కొనుగోలుకు అనుమతి ఇచ్చారు. వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ నిబంధన అమలులో ఉంటుందని తహశీల్దార్ శ్రావణ్ తెలిపారు. జిల్లాలో రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గతేడాది ఏప్రిల్ లో నమోదు అయిన విధంగా కేసులు నమోదు కావడం అధికారులను, ప్రజలను కలవరానికి గురి చేస్తున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.