FbTelugu

ప్రొడక్షన్ కావాలంటే లాక్ డౌన్ ఎత్తివేయాలి

హైదరాబాద్: చేనేత కార్మికులు ఉత్పత్తిని మొదలు పెట్టాలంటే లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాతనే అని టెస్కో డైరెక్టర్ శైలజ రామయ్యర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలను వెళ్లడించింది. ప్రస్తుతం చేనేత కార్మికులు ఖాళీగానే ఉన్నారని తెలిపారు.

రాష్ట్రంలో లాక్ కారణంగా చేనేత కార్మికులకు రూ.1,500, 12 కిలోల బియ్యం ఇచ్చామని తెలిపారు. ప్రభుత్వ పరంగా కార్మికులను ఆదుకుంటామని తెలిపారు. ప్రస్తుతం తాము క్లాత్ మాస్క్ లను తయారు చేస్తున్నట్టు తెలిపారు. రెండు లక్షల మాస్కుల తయారీ కోసం తమకు ఆర్డర్ వచ్చిందని తెలిపారు.

You might also like