FbTelugu

లాక్ డౌన్ పొడిగింపు… అదనంగా సడలింపులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ను మరో పది రోజుల పాటు పొడిగించారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపులు ఇచ్చారు. ఆ తరువాత ఇళ్లకు చేరుకునేందుకు గంట సమయం వెసులుబాటు ఇచ్చారు.

ప్రగతి భవన్ లో సిఎం కెసిఆర్ అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరుగుతోంది. రాష్ట్రంలో కరోనా కేసులు, ప్రజల ఉపాధి, కూలీల ఇబ్బందులపై చర్చించారు. రాష్ట్రంలో 19 రోజులుగా లాక్ డౌన్ అమలులో ఉండగా, మే 30వ తేదీతో ముగియనున్నది. ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే ఇచ్చారు. నాలుగు గంటల సమయం సరిపోవడం లేదని, పెంచాలని వ్యాపార వర్గాలు, రాజకీయ నాయకుల నుంచి కెసిఆర్ కు వినతులు వచ్చాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న కెసిఆర్ మరో మూడు అదనంగా సడలింపులు ఇచ్చి మధ్యాహ్నం 1 గంట వరకు వ్యాపారాలు నిర్వహించుకునేలా అనుమతించారు. ఒంటి గంట తరువాత వ్యాపారులు, సిబ్బంది ఇళ్లకు చేరుకునేందుకు మరో గంట సమయం ఇచ్చారు. వాస్తవంగా మధ్యాహ్నం ఒంటి గంట నుంచే లాక్ డౌన్ ప్రారంభమై తెల్లవారి 6 గంటల వరకు అమల్లో ఉంటుంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.