FbTelugu

లాక్ డౌన్ పొడగింపు తప్పదు : కిషన్ రెడ్డి

హైదరాబాద్: దేశంలో మూడవ సారికూడా లాక్ డౌన్ పొడగింపు తప్పదని బీజేపీ కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పలు విషయాలను వెల్లడించారు. లాక్ డౌన్ పై  ఇప్పటికే దేశంలో పలు సడలింపులు ఇచ్చామని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వాల కోరిక మేరకే లాక్ డౌన్ పొడగింపు ఉంటుందని అన్నారు.

కరోనా హాట్ స్పాట్లు లేని ప్రాంతాల్లో పరిశ్రమలకు అనుమతించినట్టు తెలిపారు. లాక్ డౌన్ పాటిస్తూ.. ప్రజలు భౌతిక దూరం పాటించినప్పుడే కరోనా మహమ్మారిని కట్టడి చేయగటమని తెలిపారు. ఈ తరుణంలోనే లాక్ డౌన్ కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. పేదవాళ్ల రవాణా ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని తెలిపారు. వలస కూలీలను గ్రూపులుగా ఏర్పాటు చేసి రవాణా కల్పించాలని సూచించారు.

You might also like