FbTelugu

భారత్ లో లాక్ డౌన్ పొడగింపు

న్యూఢిల్లీ: దేశంలో మరో 14 రోజుల పాటూ లాక్ డౌన్ ను పొడగిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఈ నెల 31 వరకు లాక్ డౌన్ ను కొనసాగించనున్నట్టు తెలిపారు.

మూడో దశ లాక్ డౌన్ ఇవాల్టితో ముగియనుండంతో నాలుగో దశ లాక్ డౌన్ కు ఆదేశాలు జారీ చేసింది. అయితే కరోనా నేపథ్యంలో ఇప్పటివరకు మూడు సార్లు లాక్ డౌన్ ను పొడగించిన విషయం తెలిసిందే.

మొదటి సారి లాక్ డౌన్ మార్చి 24- ఏప్రిల్ 14 వరకు, రెండవసారి ఏప్రిల్15- మే03 వరకు, మూడవసారి మే04- మే17 వరకు, నాల్గవ సారి మే18- మే31 వరకు విధించారు. దీనిపై మరికాసేపట్లో కేంద్ర మార్గదర్శకాలను విడుదల చేయనుంది.

కరోనా ఉధృతి దృష్ట్యా మరికొన్ని రోజులు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. ఈ 14 రోజులపాటు ప్రజలందరూ సహకరించాలని, గ్రీన్ జోన్, ఆరెంజ్ జోన్ లో మరిన్ని వెసులుబాట్లు కల్పించనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.