FbTelugu

విజయవాడలో పలు ప్రాంతాల్లో లాకౌ డౌన్

విజయవాడ: నగరంలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించడానికి సన్నాహాలు పూర్తయ్యాయి.

కేసులు అధికంగా ఉణ్న మొత్తం 21 క్లస్టర్లలో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతాల్లో సోమవారం నుండి రాకపోకలపై నియంత్రణ విధిస్తారు. ఇందుకోసం అధికార యంత్రాంగం బ్యారికేడ్లు ఏర్పాటు చేసింది. ఎంతగా చెప్పినా ప్రజలు పట్టించుకోకపోవడం, ప్రజలు స్వీయ నిర్భంధం పాటించకపోవడంతో ఈ చర్యలు తీసుకుంటున్నారు.

కరోనా క్లస్టర్లు…

పటమట, కృష్ణలంక, కొత్తపేట, మొగల్రాజపురం, విద్యాధరపురం, అజిత్ సింగ్ నగర్, భవానీపురం, చుట్టుగుంట, సత్యనారాయణపురం, వించిపేట, చిట్టినగర్.

You might also like