FbTelugu

జీహెచ్ఎంసీ పరిధిలో మళ్లీ లాక్ డౌన్ ?

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసులు గత కొన్ని రోజులుగా తీవ్రంగా పెరిగిపోతూ ఉన్నాయి. కాగా అత్యధిక కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదౌతున్నాయి. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలో కొద్ది రోజుల పాటూ లాక్ డౌన్ విధించాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం.

దీనిపై మరో రెండు మూడు రోజుల్లో తుదినిర్ణయం తీసుకోనున్నారు. కరోనా నివారణకు వ్యూహం ఖరారు చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. ఎక్కువ కేసులు వచ్చినంత మాత్రాన భయాందోళన అవసరం లేదని, అందరికీ సరైన వైద్యం అందిస్తామని కేసీఆర్ తెలిపారు.

You might also like