FbTelugu

మళ్లీ లాక్‌డౌన్… పిల్ కొట్టివేసిన హైకోర్టు

హైదరాబాద్: రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలని వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) ను హైకోర్టు కొట్టివేసింది.

సామాజిక కార్యకర్తగా చెప్పుకునే డా.సునీత కృష్ణన్ జులై 15 వరకు సంపూర్ణ లాక్‌డౌన్ విధించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పిల్ వేసింది. ప్రార్థనా మందిరాలను తెరవడం వల్ల కరోనా తీవ్రత మరింతగా పెరుగుతుందని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

లాక్ డౌన్ ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయమని.. తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణతో పాటు దాదాపు అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఎత్తివేశారు. కరోనా సమయంలో ప్రార్థనా మందిరాలకు వెళ్లాలా..? వద్దా..? అనేది ప్రజల ఇష్టమని హైకోర్టు స్పష్టం చేసింది. విచారణకు అర్హత లేదంటూ సునీత కృష్ణన్ వేసిన పిల్ ను హైకోర్టు కొట్టివేసింది.

You might also like