FbTelugu

జూన్ 15 వరకు లాక్ డౌన్ 5.00

మన్ కీ బాత్’ లో వెల్లడి?

ఢిల్లీ: లాక్ డౌన్ అనే పదం కొద్ది రోజుల పాటు ఉచ్చరించాల్సిందే. ఈ పదం వినకూడదు అనుకుంటూ పొరపడినట్టే ఇక. ఈ నెల 31వ తేదీతో లాక్ డౌన్ ముగియనున్నది.

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 31న నిర్వహించే మన్ కీ బాత్ లో లాక్ డౌన్ పొడిగింపుపై ప్రకటన చేయనున్నరు. దశల వారీగా ఇప్పటి వరకు నాలుగు లాక్ డౌన్ లను ప్రకటించిన విషయం తెలిసిందే.

లాక్ డౌన్ లక్ష్యాన్ని ఆయన వివరిస్తూనే.. దేశంలో అనేక చోట్ల ఆంక్షలను ఇంకా సడలించే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. దేశంలోని మొత్తం కరోనా వైరస్ కేసుల్లో 70 శాతం కేసులు నమోదై ఉన్న 11 నగరాల మీద దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఈ లిస్టులో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణే, థానే, చెన్నై, ఇండోర్, అహ్మదాబాద్, జైపూర్, కోల్ కతా, సూరత్ నగరాలు ఉన్నాయి. అయితే ప్రార్థనా మందిరాలను షరతులతో తెరచుకునేందుకు అనుమతించే అవకాశాలు ఉన్నాయి.

You might also like