FbTelugu

తెలంగాణలోనూ లాక్ డౌన్.2

హైకోర్టు అక్షింతలతో అమలు
హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్‌.2 విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రేపటి నుంచి (12వ తేదీ) పది రోజులపాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నారు.
లాక్ డౌన్ అమలు, కరోనా సెకండ్ వేవ్ తీవ్రత, హైకోర్టు ఆగ్రహం పై ఇవాళ ప్రగతి భవన్ ల మంత్రిమండలి సమావేశం అయ్యింది. ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకున్నది.

ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు వ్యాపార కార్యకలాపాలకు అవకాశం కల్పించింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సరిపడా వ్యాక్సిన్లను కేటాయించకపోవడంతో గ్లోబల్ టెండర్లు ఆహ్వానించాలని మంత్రి మండలి తీర్మానించింది. మహారాష్ట్రలో అమలు చేసిన విధంగానే ఇక్కడ కూడా గ్లోబల్ టెండర్లకు వెళ్తున్నారు. కరోనా ఫస్ట్ వేవ్ కారణంగా గతేడాది తొలిసారి లాక్ డౌన్ అమలు చేయగా ఈ ఏడాది మరోసారి లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. దేశంలోని పలు రాష్ట్రాలు కూడా లాక్ డౌన్ విధించడం, హైకోర్టు తీవ్రంగా మండిపడుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ పెట్టక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.