FbTelugu

మోదీ ఆదేశిస్తేనే లాక్ డౌన్: సిఎం యడియూరప్ప

బెంగళూరు: రాష్ట్రంలో లాక్ డౌన్ విధించేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశం కోసం ఎదురు చూస్తున్నామని సిఎం యడియూరప్ప తెలిపారు. రాష్ట్రంలో కఠిన ఆంక్షలు విధించినప్పటికీ కేసులు తగ్గడం లేదని, మంగళవారం నాడు ఒక్కరోజే 44వేలకు పైగా నమోదు అయ్యాయని అన్నారు.

బెంగళూరు నగరంలో నే 22వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. లాక్ డౌన్ పై మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా అమలు చేస్తామని యడియూరప్ప స్పష్టం చేశారు. ఏప్రిల్ 27వ తేదీ రాత్రి నుంచి మే 12 వరకు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నామన్నారు. అయినా కేసుల్లో ఏమాత్రం తగ్గుదల కన్పించడం లేదని ఆయన వివరించారు. వైరస్ ను నియంత్రణలోకి తెచ్చేందుకు లాక్ డౌన్ విధించాలనే నిర్ణయానికి వచ్చామన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.