FbTelugu

ఢిల్లీలో వారం రోజులు లాక్ డౌన్: సిఎం కేజ్రీవాల్

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల పాటు లాక్ డౌన్ అమలులో ఉంటుందని ఆయన ప్రకటించారు.

గత పది రోజులుగా రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నియంత్రించేందుకు సిఎం కేజ్రీవాల్ కఠినం నిర్ణయం తీసుకోక తప్పలేదు. ఇవాళ రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఏప్రిల్ 26వ తేదీ ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుందని తెలిపారు. ప్రైవేటు సంస్థలు వర్క్ ఫ్రం హోం  ద్వారా పనిచేయాలని, ప్రభుత్వ కార్యాలయాలు, అత్యవసర సేవా విభాగాలు పనిచేస్తాయని వివరించారు. అదే విధంగా వారంతపు మార్కెట్లకు అనుమతించామన్నారు. కరోనా వైరస్ ను నిలువరించేందుకు ఇవాళ ఉదయం సిఎం కెజ్రీవాల్ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.