FbTelugu

అటవీశాఖ అధికారులపై స్థానికులు దాడి

నల్లగొండ: అటవీశాఖ అధికారులపై స్థానికులు దాడికి పాల్పడిన ఘటన జిల్లాలోని అడవిదేవులపల్లి మండలం ఆదిమాణిక్యంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అటవీ రాళ్లను అక్రమంగా తరలిస్తున్న స్థానికులను ఫారెస్టు అధికారులు అడ్డుకున్నారు.

బండలను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేసి తరలిస్తుండగా… స్థానికులు ఒక్కసారిగా అటవీ అధికారులపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అధికారులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

You might also like