FbTelugu

లోకల్ ఎన్నికలంటే పిల్లికి వణుకు : అయ్యన్న పాత్రుడు

అమరావతి: పులివెందుల పిల్లికి లోకల్ ఎన్నికలు అనగానే వణుకు పుట్టి అర్థంపర్థం లేని ఆరోపణలు చేసి పారిపోతున్నాడంటూ టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు విమర్శలు కురిపించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా పలు వ్యాఖ్యలు చేశారు. ‘‘కరోనా విజృంభిస్తున్న సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తే నిమ్మగడ్డ టిడిపి వ్యక్తి అంటూ నోరుపారేసుకున్నాడు.

ఫేక్ సీఎం జగన్ రెడ్డి ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గింది అందుకే పాఠశాలలు తెరిచాం అని చెబుతున్న ప్రభుత్వమే ఎన్నికల షెడ్యూల్ విడుదల చెయ్యగానే నిమ్మగడ్డ టిడిపి మనిషి అంటూ మరోసారి ఫేక్ ప్రచారం మొదలెట్టింది .అసలు విషయం ఏంటి అంటే చెత్త పాలన చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు అనే రహస్య నివేదికలు ప్రశాంత్ కిషోర్ అందజేసాడు. అందుకే పులివెందుల పిల్లికి లోకల్ ఎన్నికలు అనగానే వణుకు పుట్టి అర్థంపర్థం లేని ఆరోపణలు చేసి పారిపోతున్నాడు.’’ అంటూ ట్వీట్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.