FbTelugu

స్థానికుల శవాలే దహనం చేయాలి

అంబర్ పేట స్మశాన వాటిక మేనేజర్ కు వినతిపత్రం

హైదరాబాద్: అంబర్ పేట్ స్మశానవాటికలో ఇకనుంచి స్థానికుల మృతదేహాలనే దహనం చేయాలని, రాత్రిపూట దహన కార్యక్రమాలు నిలిపివేయాలని అంబర్ పేట వాసులు డిమాండ్ చేశారు.

స్థానిక ప్రజల మృతిదేహాలు కాకుండ హైదరాబాద్ నగర వ్యాప్తంగా వచ్చే మృతిదేహాలను ఇక్కడ దాహనం చేయవద్దని స్మశాన వాటిక మేనేజర్ ను కోరారు. ప్రతి రోజు 30 శవాల వరకు దహనం చేస్తుండడం మూలంగా, దాని నుంచి వచ్చే వాసన తట్టుకోలేకపోతున్నామన్నారు. కనీసం రాత్రిపూట విరామం ఇవ్వకుండా దహనం చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఉస్మానియా హాస్పిటల్ నుంచి వచ్చే కుళ్లిన శవాలు, కరోనా వ్యాధితో చనిపోయిన వారి మృతదేహాలను కూడా ఇక్కడే దహనం చేస్తున్నారని వారు మేనేజర్ తో వాగ్వాదం చేశారు. ఇకనుంచైనా అంబర్ పేట్ ప్రాంతానికి చెందిన వారి మృతిదేహాలను మాత్రమే దాహనం చేయాలని స్థానికులు మహేందర్, రాజు సుషెరాజ్, రామాంజనేయులు, శ్రీశైలం తదితరు కోరారు.

You might also like