FbTelugu

మళ్లీ లోన్ యాప్స్ కేటుగాళ్ల కలకలం

హైదరాబాద్: కొందరు రాజకీయ నాయకులు, పోలీసు అధికారుల అండదండలతో లోన్ యాప్స్ స్కామ్ కేటుగాళ్లు మళ్ళీ రంగంలోకి దిగారు. ఈసారి పెద్ద కుట్రకే తెరదీశారు. ఏకంగా  సైబర్ క్రైమ్స్ లెటర్ హెడ్, స్టాంపులు, సంతకాలు నకిలీవి తయారు చేశారు.

పలు బ్యాంకులలో స్తంభించిపోయిన (ప్రీజ్) అయిన తమ ఖాతాల నుంచి డబ్బులు డ్రా చేసేందుకు పన్నాగం మొదలుపెట్టారు. బ్యాంకులలో ఫ్రీజ్ అయిన ఖాతాలలో కోట్లాది రూపాయల నిల్వలు ఉన్నాయి. ఈ నిధులను చేజిక్కించుకుని తమ కార్యకలాపాలను మరో రూపంలో ప్రారంభించేందుకు ప్రణాళికలు వేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ అధికారుల పేరుతో బ్యాంకులకు లేఖలను పంపించారు. సైబర్ క్రైమ్స్ పేరుతో నకిలీ లెటర్ హెడ్, స్టాంపులు, సంతకాలు చేశారు. ఐసిఐసిఐ బ్యాంకుకు చెందిన ఢిల్లీ గుర్గావ్ తదితర బ్రాంచులకు లేఖలు రాశారు. దీనిపై అనుమానించిన ఐసిఐసిఐ బ్యాంకు అధికారులు లేఖలను హైదరాబాద్ సైబర్ క్రైమ్ అధికారుల దృష్టికి తెచ్చారు. ఈ లేఖలను చూసి వారు కంగు తిన్నారు. తమకు తెలియకుండా, నకిలీ సంతకాలతో ఎలా తయారు అయ్యాయనే దానిపై విచారిస్తున్నారు.

పోలీసు విభాగంలోని కొందరి మద్దతు తోనే ఇది జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అవి నకిలీ లేఖలని తేల్చిన సైబర్ క్రైమ్స్ అధికారులు, ప్రీజ్ అయిన ఖాతాల నుంచి డబ్బులు చెల్లించవద్దని ఐసిఐసిఐ అధికారులను కోరింది. నకిలీ లెటర్ హెడ్, స్టాంపుల, సంతకాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.