FbTelugu

రుణ యాప్ ల మోసం రూ.22వేల కోట్లు

హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇన్ స్టంట్ రుణ యాప్ ల కేసులో సిసిఎస్ సైబర్ క్రైమ్స్ పోలీసులు చార్జిషీట్ సిద్ధం చేశారు. ఇప్పటివరకు ఈ కేసులో ఇరవై మందిని అరెస్ట్ చేశారు. ఢిల్లీ లో ఆరుగురు, హైదరాబాద్ లో ఆరుగురు, బెంగుళూరు లో ఏడుగురు, కర్నూల్ లో ఒకరు చొప్పున అరెస్ట్ అయ్యారు.

ఇన్ స్టంట్ రుణ యాప్ ల ద్వారా రాష్ట్రంలో మొత్తం 22 వేల కోట్ల మోసపూరిత వ్యాపారం జరిగినట్లు తేలింది. 197మొబైల్ యాప్ ల ద్వారా లక్షలాది మందికి అత్యధిక వడ్డీ తో పదివేల లోపు రుణాలు ఇచ్చి దోపిడి చేశారు. దేశంలోని పలు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల(ఎన్.బి.ఎఫ్.సి) ను ముఠా ప్రధాన నిర్వాహకుడు, చైనా దేశీయుడు లాంబో యథేచ్ఛగా వాడుకున్నాడు. బెంగుళూరు కేంద్రంగా లాంబో… పిన్ పింగ్ టెక్నాలజీస్, ల్యూఫాన్గ్ టెక్నాలజీస్, నా బ్లూమ్ టెక్నాలజీస్, హార్ట్ ఫుల్ టెక్నాలజీస్ పేరుతో నాలుగు సంస్థలు ఏర్పాటు చేశాడు. తర్వాత వేగంగా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలలో కాల్ సెంటర్లు పెట్టాడు. బిటెక్ విద్యార్థులను ఉద్యోగులుగా చేర్చుకుని, వారి సంతకాలు తీసుకుని వారిపేరుపై రుణాలు ఇచ్చాడు. రాష్ట్రాల వారీగా స్థానిక ఫైనాన్స్ వ్యాపారులను ఉచ్చులోకి లాగి పని కానిచ్చేశాడు.

నయా పైసా పెట్టుబడి లేకుండా వేలకోట్ల వ్యాపారం చేశాడు. ప్రధాన సూత్రధారి అయిన చైనా దేశీయుడు యోన్ యోన్ అలియాస్ జెన్నిఫర్ చైనా నుండే లాంబో ద్వారా భారత్ లో కార్యకలాపాలు సాగించాడు. విదేశాల నుంచి నిర్వహించినందున పోలీసులు ఆయనను అరెస్ట్ చేయలేక పోయారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.