FbTelugu

5గురు ఎంపిలపై ఎల్.జె.పి అధినేత వేటు

పాట్నా: ప్రత్యేక శిబిరంగా ఏర్పాటు అయి పార్టీపై తిరుగుబావుటా ఎగురవేసిన ఐదుగురు ఎంపిలపై లోక్ జనశక్తి పార్టీ వేటు వేసింది. వీణా దేవి, పశుపతి పరాస్, ప్రిన్స్ రాజ్, చందన్ సింగ్, మెహబూబ్ అలీ కేశార్ లను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు.

పశుపతి పరాస్ నేతృత్వంలో ఈ ఐదుగురు పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్ కు వ్యతిరేకమయ్యారు. మంగళవారం నాడు జార్టీ జాతీయ కార్యవర్గం సమావేశమైంది. పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీసులకు స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఎల్.జె.పి నుంచి ఆరుగురు ఎంపిలు ఎన్నిక కాగా ఇప్పుడు పార్టీ అధినేత చిరాగ్ మాత్రమే మిగిలారు. అంతకు ముందు పశుపతి నాయకత్వంలో ఎంపిలు లోకసభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. తమ పార్టీ నేతగా పశుపతిని గుర్తించాలని లేఖ అందచేశారు. ఈ విషయమై చర్చలు జరిపేందుకు చిరాగ్ చిన్నాన్న అయిన పశుపతి ఇంటికి వెళ్లాడు. ఆయన ఎంతకీ తలుపులు తీయకపోవడంతో గంటల పాటు వేచి ఉండి వెళ్లిపోయాడు. గతేడాది మరణించిన రామ్ విలాస్ పాశ్వాన్ సొంత తమ్ముడు పశుపతి పరాస్. ఎల్.జె.పి రాష్ట్రంలో లేకుండా చేసేందుకు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పావులు కదుపుతున్నట్లు కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.