పాట్నా: ఎమ్మెల్యే కారులో అక్రమంగా మద్యం తరలిస్తూ అడ్డంగా పోలీసులకు దొరికిపోయిన ఘటన బీహార్ లోని సిమ్రీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నలుగురు వ్యక్తులు కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తివారీ కారులో లాక్ డౌన్ లో అక్రమంగా మద్యం తరలిస్తున్నారు. ఈ తరుణంలో పోలీసులు దాడి చేసి ఆ కారును పట్టుకొని మద్యం స్వాదీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్పీ తెలిపారు.