FbTelugu

పాతాళంలో మద్యం సీసాలు సీజ్

గుంటూరు: భూమి లోపల పాతిపెట్టిన మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 16,500 సీసాలు కన్పించడంతో పోలీసులు కంగుతిన్నారు.

పోలీసుల కథనం ప్రకారం వెల్దుర్తి మండలం ఉప్పలపాడులో భారీగా నకిలీ మద్యం బాటిళ్లు బయటపడ్డాయి. భూమిలో పాతిపెట్టిన 16,500 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలోని బెల్గంలో మద్యం తయారు చేసినట్టు ప్రాథమిక విచారణలో  గుర్తించారు. 18 మంది నిందితులు అరెస్ట్ చేసిన పోలీసులు తెలిపారు. అలాగే మద్యం తయారీ మిషన్లను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.