FbTelugu

మద్యం, బ్యాంకు సేవలు బంద్

హైదరాబాద్: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ అర్ధరాత్రి 12 గంటల నుండి ఆదివారం అర్ధరాత్రి వరకు మద్యం దుకాణాలు, బార్లు మూసివేస్తారు. అదే విధంగా శనివారం నుండి నాలుగు రోజులు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఇవ్వాల్టితో ముగియనున్నది. గత రెండు వారాలుగా ఖమ్మం-నల్గొండ-వరంగల్, మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల స్థానాల్లో సాధారణ ఎన్నికలను తలపిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈనెల13న రెండవ శనివారం 14వ తేదీన ఆదివారం బ్యాంకులకు సాధారణ సెలవు దినాలు కాగా, బ్యాంకులను ప్రైవేటుపరం చేయడాన్ని నిరసిస్తూ ఈనెల 15,16 తేదీల్లో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ పిలుపు మేరకు బ్యాంకు సిబ్బంది బంద్ పాటిస్తున్నారు. ఈ నాలుగు రోజులు మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు యధావిధిగా కొనసాగనున్నాయి. బ్రాంచి సేవలు మాత్రమే నిలిచిపోనున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.