FbTelugu

శేహబాష్ జిల్లా కలెక్టర్…

అనంతపురం: ఆక్సీజన్ సిలిండర్ల కోసం వెంపర్లాడుతున్న తరుణంలో ఒక జిల్లా కలెక్టర్ ప్రయత్నం పలువురి ప్రాణాలను నిలబెడుతున్నది. అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోగులకు అత్యవసరమైన సమయంలో వైద్య సేవలు అందించేందుకు 13 కిలో లీటర్ల సామర్థ్యం కలిగిన లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. గత నెల 25 వ తేదీ నుండి ఈ ఆక్సిజన్ ప్లాంట్ వినియోగం లోకి వచ్చింది.

లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు తర్వాత ఆక్సిజన్ సిలిండర్ ల అవసరం లేకుండా పోయింది. సిలిండర్ల కోసం ఎదురు చూపులు తప్పాయి. ఈ ప్లాంట్ ఏర్పాటయ్యేలా జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్ల ఎందరి ప్రాణాలనో కాపాడుతున్నదని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.రామస్వామి నాయక్ తెలిపారు.
కరోనా సమయంలో ఈ ప్లాంట్ రోగులకు బాగా ఉపయోగపడుతోందని ఆయన చెప్పారు. కరోనా పాజిటివ్ కేసులకు, ప్రసవాలు, పాము కాటు, విష సేవనం బాధితులకు ఆక్సిజన్ అందించడం జరుగుతోందని సూపరింటెండెంట్ వివరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.