FbTelugu

టీటీడీలో తిరుమలలో దీక్షితులు

Line-Clear-to-Ramana-Deekshitulu

అమరావతి: టీటీడీలో మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కు మార్గం సుగమం అయింది. సీఎం జగన్ ఆదేశాలతో రమణ దీక్షితులుకు తిరుమలలో ఆలయ ప్రవేశం కల్పిస్తూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. ఆగమ సలహదారుడిగా నియమించారు. నూతన అర్చకులకు మార్గదర్శకుడిగా ఆయన సేవలు వినియోగించుకోవాలని భావిస్తున్నారు. కోర్టు కేసులు పరిష్కారం తరువాత అర్చకత్వ భాధ్యతలును అప్పగించనున్నారు. ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన హమీతో రమణ దీక్షితులు ఆలయ ప్రవేశం కల్పించారు. రమణ దీక్షితులు ఇద్దరు కుమారులను గోవిందరాజ స్వామి ఆలయం నుంచి తిరుమల ఆలయానికి బదిలి చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

You might also like