FbTelugu

ఏపీలో మూడు రాజధానులకు లైన్ క్లీయర్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులకు గవర్నర్ బిస్వభూషన్ హరిచందన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గవర్నర్ ఆమోదంతో మూడు రాజధానుల బిల్లుకు లైన్ క్లీయర్ అయ్యింది. ఇవాళ సీఆర్డీఏ రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపారు.

గతంలో ఈ రెండు బిల్లులు శాసన సభలో ఆమోదం పొంది శాసన మండలిలో ఎలాంటి చర్చ జరగకుండానే వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం శాసన సభ ఆమోదంతోనే గవర్నర్ కు బిల్లులను పంపింది. తాజాగా  గవర్నర్ ఆ బిల్లులను ఆమోదించడంతో.. ఎగ్జిక్యూటివ్ (కార్యనిర్వహక) క్యాపిటల్ గా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు అవతరించనున్నాయి.

You might also like