FbTelugu

భాగ్య‌న‌గ‌రంలో 112 ఏళ్ల త‌రువాత ఇలా!

రంజాన్ అన‌గానే కేవ‌లం ముస్లిం సోద‌రుల ఉప‌వాస‌మే కాదు. అంత‌కు మించిన శాంతిసామ‌ర‌స్య‌త దాగుంది.

క‌రోనా వైర‌స్ వ్యాప్తి కి కార‌ణ‌మంటూ కొంద‌రు ద్వేషం వెనుక ఆలోచ‌న ఎలా ఉన్నా.. రంజాన్ వేళ ఇఫ్తార్ విందుల్లో అన్నిమ‌తాల వారూ పాలుపంచుకుంటారు. పొరుగునే ఉన్న హిందు, సిక్కు, క్రైస్త‌వ సోద‌రుల‌కు షీర్‌కుర్మా, బిర్యానీ, హ‌లీం పంపి ఆలింగ‌నం పంపే మిత్రులూ ఉంటారు. రంజాన్ రోజు విందుభోజ‌నంతో ఆనందించే స‌మైక్య‌త హైద‌రాబాద్‌లో మాత్ర‌మే క‌నిపిస్తుంది.

అందాకా ఎందుకు.. చార్మినార్ వ‌ద్ద రాత్‌బ‌జార్‌లో మ‌ట్టిగాజులు కొనేందుకు హిందు మ‌హిళ‌లు క్యూ క‌డ‌తారు. అక్క‌డ సోద‌రిగా భావించి చేతుల‌కు గాజులు తొడిగే ముస్లిం సోద‌రుల‌కు మొక్కుతారు. ఇవ‌న్నీ గ‌తం. రాజ‌కీయ పార్టీల పుణ్యాన‌.. మ‌తాల మ‌ధ్య దూరం.. మ‌నుషుల మ‌ధ్య అంత‌రాలు పెరుగుతున్నాయి. ప్ర‌కృతి కూడా మాన‌వాళికి గుణ‌పాఠం నేర్పాల‌ని సిద్ధ‌మైంది.

దాని ఫ‌లిత‌మే క‌రోనా అనుకోవాలంటున్నారు వేద‌పండితులు, మ‌త‌పెద్ద‌లు కూడా. హైద‌రాబాద్ లో రంజాన్ క‌ళ నెల‌రోజుల‌పాటు క‌నిపిస్తుంది. కానీ.. ఈ సారి జీవ‌క‌ళ పోయి శ్మశాన‌వైరాగ్యం తాండవిస్తుంది. ఇది ఇప్పుడు తొలిసారి కాద‌ట‌.. 1918లో సెప్టెంబ‌రు 26-28వ తేదీ వ‌ర‌కూ మూసీ న‌దికి వ‌ర‌ద‌లు వ‌చ్చాయి. నీరు ఉప్పొంగి న‌గ‌రాన్ని చుట్టుముట్టింది. ఆ స‌మ‌యంలోనే రంజాన్ నెల రావ‌టంతో రంజాన్ పండుగ వేళ దీక్ష‌లు సంగ‌తి ఎలా ఉన్నా అంతా మూగ‌బోయింద‌ట‌. ఇప్పుడు క‌రోనా దెబ్బ‌కు లాక్‌డౌన్ ప్ర‌క‌టించారు. దాదాపు 45 రోజులుగా ఇదే వాతావ‌ర‌ణం. రంజాన్ వేళ కూడా మ‌సీదులు మూగ‌బోతున్నాయి. పండుగ క‌ళ క‌నిపించ‌ట్లేదు. రాత్‌బ‌జార్ గ‌త వైభ‌వానికి గుర్తుగా క‌నిపిస్తుంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.