FbTelugu

కేసీఆర్ ఇంటి ముందు మెరుపు నిరసన

హైదరాబాద్: సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ ముందు కొద్ది మంది యువకులు మెరుపు నిరసనకు దిగి వెళ్లిపోయారు.
ప్రగతి భవన్ వద్ద నిరసనకారులు ఫ్ల కార్డు తో హాల్ చల్ చేశారు. వేర్ ఈజ్ కేసీఆర్, హీ ఈజ్ మై సీఎం, ఇటీజ్ మై రైట్ టూ నో అంటూ ఫ్లకార్డు ప్రదర్శించాడు ఒక యువకుడు.

బైక్ పై ప్రగతి భవన్ ఎగ్జిట్ గేట్ వైపు దూసుకొచ్చిన ఇద్దరు యువకులు ఈ చర్యకు పాల్పడ్డారు. పోలీసులు రావడంతో ఎగ్జిట్ గేట్ నుంచి వెళ్లిపోయారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ దొరక్కుండా వెళ్లారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.