FbTelugu

పొంచి ఉన్న మరో అల్పపీడనం

హైదరాబాద్: రేపు ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

దీని ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, యానాం రాయలసీమ ప్రాంతాల్లో నేడు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

You might also like