FbTelugu

సీఆర్డీఏ యూనిట్ ఆఫీసుల ఎత్తివేత

అమరావతి: అమరావతి రాజధాని గ్రామాలలో సీఆర్డీఏ యూనిట్ కార్యాలయాలు తొలగింపు ప్రక్రియక ప్రారంభమైంది. తుళ్లురు సీఆర్డీఏ రీజనల్ కార్యాలయం నుండే కార్యకలాపాలు కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

మంగళగిరి మండలంలోని 7 గ్రామాలైన యర్రబాలెం, నవులూరు, బేతపూడి, నిడమర్రు, కురగల్లు, నీరుకొండ, తాడేపల్లి మండలంలోని 2 గ్రామాలైన పెనుమాక , ఉండవల్లి గ్రామాలు రాజధాని అమరావతి 29 గ్రామాలలో కలసి ఉన్నాయి. తాడేపల్లి మండలం, మంగళగిరి మండలంలోని రాజధాని గ్రామాలలోని సీఆర్డీఏ యూనిట్ కార్యాలయాలను ఇటీవల తరలించారు.

ఈ కార్యాలయాల రికార్డులను తుళ్లురు సీఆర్డీఏ రీజనల్ కార్యాలయం కు తరలించారు. ఇక నుంచి రీజనల్  కార్యాలయం నుండే కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని అధికారులు తెలిపారు.

 

You might also like