FbTelugu

కేసీఆర్ మేన‌ల్లుడి నుంచి ప్రాణహాని: ప్రభాకర్

హైద‌రాబాద్: సీఎం కేసీఆర్ మేనల్లుడు విజ‌య భాస్క‌ర్ నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఒక వ్యాపారవేత్త పాబంది ప్రభాకర్ దంపతులు ఆరోపించారు.
విజయ్ భాస్కర్ తోనే కాకుండా పోలీసుల నుంచి కూడా ప్రాణహాని ఉందని, సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని ప్రభాకర్ దంపతులు కోరారు. ఒక బిల్డర్ తో కలిసి తనకు చెందిన రూ.23 కోట్ల విలువైన ఆస్తిని విజయ భాస్కర్ బలవంతంగా రాయించుకున్నాడని మీడియాకు తెలిపారు. ఈ ఆస్తికి సంబంధించిన సివిల్ వ్యవహారాన్ని సెటిల్ చేసుకోవాలని తనపై సైబరాబాద్ పరిధిలోని పలు పోలీసు స్టేషన్లలో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు.

సెటిల్మెంట్ కు ఒప్పుకోకపోవడంతో తనను 45 రోజులు జైలుకు పంపించారని ప్రభాకర్ ఆరోపించారు. తనకు , తన కుటుంబానికి పోలీసుల నుండి, కేసీఆర్ మేనల్లుడు విజయ్ భాస్కర్ రావు నుండి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

You might also like