FbTelugu

ప్రేమ విఫలమైతే జీవితం ఆగిపోదు: రేణు దేశాయ్

హైదరాబాద్: ప్రేమలో విఫలమైనంత మాత్రాన జీవితం ఆగిపోదని, ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం కూడా సరికాదని నటి రేణు దేశాయ్ అన్నారు. ప్రేమించి, పెళ్లి చేసుకున్న వ్యక్తి దూరమైతే ఆ బాధ చెప్పనలవిగా ఉంటుందన్నారు.

ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో పలువురు అభిమానులతో ముచ్చటించిన రేణు దేశాయ్… వారడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ప్రేమలో విఫలమైతే తట్టుకోవడం చాలా కష్టమని, ఆ బాధ, వేదన తనకు తెలుసని అన్నారు. మనం ఎంతగానో ప్రేమించిన భర్త మన పక్కన లేదని, మనం మోసపోయామని అనిపించినప్పుడు చాలా కష్టంగా ఉంటుందన్నారు. తట్టుకోలేని ఈ బాధ నుంచి బయటపడే ప్రయత్నం చేయాలని, ఆత్మహత్య చేసుకోవాలని అనుకోవడం తప్పన్నారు. ప్రాణం కన్నా ఎవరూ ఎక్కువ కాదని, కుటుంబ సభ్యులు, స్నేహితుల సాయంతో ఈ బాధ నుంచి బయటపడాలని రేణు సూచించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.