FbTelugu

ప్రజల సమక్షంలో రాకేశ్వర్ కు విముక్తి

బీజాపూర్: తమ చెరలో బందీగా ఉన్న కమాండో రాకేశ్వర్ సింగ్ మన్హాస్ ను మావోయిస్టులు ప్రజల సమక్షంలో విడుదల చేశారు. బస్తర్ జిల్లా కలెక్టర్ కు, ఎస్పీకి ఈమేరకు సమాచారం అందింది.

సామాజిక కార్యకర్త ధర్మపాలా షైనీ గోండ్వానా, సమాజ్ అధ్యక్షుడు ఒరియా, వందలాది మంది గ్రామస్తుల సమక్షంలో రాకేశ్వర్ సింగ్ ని మావోయిస్టులు అప్పగించారు. 11మంది సభ్యలు బృందం రాకేశ్వర్ సింగ్ విడుదల కోసం మావోయిస్టులతో చర్చలు జరిపింది. వీరిలో ఏడుగురు జర్నలిస్ట్ లు కూడా ఉన్నారు. సుకుమా రేంజ్ లోని తెర్రం క్యాంప్ కు రాకేశ్వర్ సింగ్ ను తీసుకొచ్చి అప్పగించారు. ఆయన క్షేమంగా బెటాలియన్ కు చేరుకోవడంతో సిఆర్పిఎఫ్ బలగాలు, ఉన్నతాధికారులు సంతోషం వ్యక్తం చేశారు. గత ఐదు రోజులు కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.