FbTelugu

ఎల్.జి షాకింగ్ నిర్ణయం

న్యూఢిల్లీ: ఎల్.జి కంపెనీ అంటే తెలియని వారు ఉండరు. అలాంటి కంపెనీ నష్టాలతో నెట్టుకు రాలేక కొన్ని విభాగాలను మూసేయాలని నిర్ణయించింది. మొబైల్ ఫోన్ వ్యాపారానికి రాం రాం చెప్పనున్నట్లు ప్రకటించింది.

గత ఆరు సంవత్సరాలలో ఎల్.జి కంపెనీ మొబైల్ ఫోన్ల కారణంగా రూ.32,856 కోట్లు నష్టపోయింది. నష్టాల నుంచి గట్టెక్కేందుకు ప్రయత్నించినప్పటికీ సఫలం కాకపోవడంతో ఈ వ్యాపారం నుంచి వైదొలగాలని నిర్ణయించినట్లు ఎలక్ట్రానిక్స్ విభాగం సిఈఒ వెల్లడించారు. మొబైల్ మార్కెట్ ప్రారంభంలో ప్రపంచంలో మూడో అతి పెద్ద స్మార్ట్ ఫోన్ తయారీదారుగా అవతరించింది. చైనా కంపెనీలకు ధీటుగా మార్కెటింగ్ నైపుణ్యం లేకపోవడం పెద్ద సమస్యగా పరిణమించింది. ఎల్.జి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలతో సహా అనేక మొబైల్స్ ఆవిష్కరణలతో పేరు ప్రఖ్యాతులు పొందినప్పటికీ రాణించలేకపోయింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.