FbTelugu

ఎల్జీ పాలిమర్స్ కు సుప్రీంలో చుక్కెదురు..

ఢిల్లీ: ఎల్జీ పాలిమర్స్ కంపెనీ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు అయింది. కంపెనీ సీజ్ చేయాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఈ కేసులో జోక్యం చేసుకోలేమని, ఏ వాదనలనైనా ఏపీ హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ముందు విన్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఏక పక్షంగా ఎల్జీ పాలిమర్స్ ను మూసివేయాలని ఆదేశించిందని, ఇది అన్యాయమని కంపెనీ తరఫున ముకుల్ రోహత్గీ వాదించగా, సుప్రీం తోసిపుచ్చింది. ప్లాంట్‌లోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఎల్‌జీ పాలిమర్స్‌ విజ్ఞప్తిని తిరస్కరించింది.

ఏడు కమిటీల్లో దేనికి హాజరుకావాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని పిటిషన్‌లో పేర్కొన్నా సుప్రీంకోర్టు విన్పించుకోలేదు. తదుపరి విచారణ కొనసాగించేందుకు నిరాకరించింది.

You might also like