FbTelugu

సొంత పార్టీ సిఎం పైనే కేంద్ర మంత్రి ధ్వజం

న్యూఢిల్లీ: కరోనా రోగుల పట్ల వైద్యులు నిర్ధయగా వ్యవహరిస్తున్నారని, రిఫర్ లెటర్ పేరుతో తిప్పుకుంటున్నారని కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్, యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్ కు రాసిన లేఖ వైరల్ అయ్యింది.

కరోనా రోగులను ఆసుపత్రుల్లో చేరుచకోవడం లేదని, అధికారులకు మొబైల్ ఫోన్ చేస్తే సమాధానం ఇవ్వడం లేదని కేంద్ర మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఈ సమయంలో రాష్ట్రంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖను పటిష్టం చేయాలని ఆయన లేఖలో స్పష్టం చేశారు. బరేలీ నియోజకవర్గంలో ఒక ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్నారు. రోగులకు అవసరమైన ఐసియు బెడ్లు, ఆక్సిజన్ ప్లాంట్లు, కరోనా మెడిసిన్స్ సమకూర్చాలన్నారు. మందులు, పరికరాలు కొందరు బ్లాక్ మార్కెట్ కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని, వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని కేంద్ర మంత్రి సూచించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.