FbTelugu

ఏపి పరీక్షలపై అమిత్ షా కు లేఖ

అమరావతి: దేశంలోని దాదాపు 14 రాష్ట్రాలతో పాటు ఐసిఎస్‌ఈ, సిబిఎస్‌ఈ బోర్డు పరీక్షలు రద్దు చేశారని, ఏపీలో మాత్రం ఇందుకు విరుద్ధంగా చర్యలు ఉన్నాయని టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో పది, ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల రద్దుకు కేంద్రం జోక్యం కోరుతూ హోంమంత్రి అమిత్ షాకు నారా లోకేష్ లేఖ రాశారు. జూన్ 7 నుంచి వేలాది పరీక్షా కేంద్రాల్లో 6.7 లక్షల మంది విద్యార్థులకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. 5 లక్షలకు పైగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు తమ పరీక్షల పట్ల అనిశ్చితిని ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం మూలంగా ఈ రెండు తరగతుల విద్యార్థులు ఎంతో మానసిక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది మార్చి నుంచి ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చిన విద్యార్థులు పరీక్షలు రాసేందుకు సిద్ధంగా లేరని లోకేష్ వివరించారు.
అనవసరంగా మరింత మందిని కరోనా రెండో దశ ఉధృతికి పరీక్షల వంకతో ఫణంగా పెట్టడం తగదని అన్నారు. లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి పరీక్షలు వద్దని అభ్యర్థనలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. పరీక్షల నిర్వహణ తో విద్యార్థులను సూపర్‌స్ప్రెడర్ లుగా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

పది, ఇంటర్ పరీక్షల విషయం లో సిబిఎస్ఈ అనుసరిస్తున్న విధానాన్ని ఏపి ప్రభుత్వం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అమిత్ షా ను కోరారు. ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల ఆందోళనలను గమనించి విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం నిర్ణయం తీసుకోవాలని నారా లోకేష్ వినతి చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.