FbTelugu

లాక్ డౌన్ తోనే కరోనాను తరిమికొడదాం: హరీష్ రావు

హైదరాబాద్: రాష్ట్రంలో మరి కొన్నాళ్లు లాక్ డౌన్ ను కొనసాగించి కరోనా మహమ్మారిని తరిమికొడదామని రాష్ట్ర మంత్రి హరీష్ రావు అన్నారు.

తెలంగాణలో నిన్న కేవలం రెండు కేసులే నమోదైనాయని, రాష్ట్రంలో క్రమంగా కరోనా తగ్గుముఖం పడుతోందని తెలిపారు. కరోనా కట్టడిలో తెలంగాణ దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలిచిందన్నారు. ప్రతి రేషన్ కార్డుదారులకీ రూ.1500 నగదు, 12 కిలోల బియ్యం అందించనున్నట్టు తెలిపారు. వైద్యులు, పోలీసులు, జర్నలిస్టుల సేవలు అమోఘం అని తెలిపారు.

You might also like