FbTelugu

అంగుళం భూభాగాన్ని కూడా వదులుకోం: రాజ్ నాథ్

జమ్ము కశ్మీర్: భారత్ లో ఒక్క అంగుళం భూభాగాన్ని కూడా వదులు కోమని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఇవాళ ఆయన లేహ్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ గౌరవం అన్నింటికన్నా చాలా గొప్పదని అన్నారు.

దీటుగా జవాబు చెప్పడానికి సిద్దంగా ఉన్నామంటూ.. చైనాను పరోక్షంగా హెచ్చరించారు. గత మూడు రోజులుగా సరిహద్దు ప్రాంతాల్లో రాజ్ నాథ్ సింగ్ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. భారత్-చైనా సరిహద్దులో తాజా పరిణామాల నేపథ్యంలో రాజ్ నాథ్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.

You might also like