FbTelugu

ఎవరూ భయాందోళనకు గురికావద్దు: అవంతి

ఎల్జీ పాలిమర్స్ పై చర్యలకు వెనకాడేది లేదని.. ఈ విషయంలో ఎవరూ భయాందోళనకు గురి కావొద్దని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే విచారణ ప్రారంభమైందని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ మృతుల కుటుంబాలకు సీఎం జగన్ భరోసా ఇచ్చారని, వారిని అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. మృతుల కుటుబాలకు రూ.కోటి సాయం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

You might also like